
తాజా వార్తలు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆధ్వర్యంలో హరితహారం
హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆధ్వర్యంలో గుర్రంగూడ రిజర్వు ఫారెస్టులో సోమవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ మొక్కలు నాటారు.
రిజర్వ్ ఫారెస్టులోని 53 ఎకరాల్లో 50 వేల మొక్కలను మార్గదర్శి సంస్థ నాటింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకంలో భాగంగా సంస్థ మొక్కల పెంపకాన్ని చేపట్టింది. ఈ క్రమంలో రెండేళ్లుగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చూస్తోంది. అభివృద్ధి చేసిన ఫారెస్ట్ బ్లాక్‌ను మార్గదర్శి ఎండీ అటవీశాఖకు అప్పగించారు.
Tags :