close

తాజా వార్తలు

107వ మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ ప్రారంభం

హైదరాబాద్‌ : కొంపల్లిలో 107వ మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్  ప్రారంభమైంది. ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్స్‌ ఎండీ శైలజాకిరణ్ ఈ బ్రాంచ్‌ని ప్రారంభించారు. మార్గదర్శి చిట్ ఫండ్ గత 57 ఏళ్లుగా ఖాతాదారుల మన్ననలు పొందుతోందని.. ఇవాళ 107వ బ్రాంచ్‌ను కొంపల్లిలో ప్రారంభించడం ఆనందంగా ఉందని శైలజాకిరణ్‌ అన్నారు. ఈ ప్రాంత వినియోగదారులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బ్రాంచ్‌ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించడంతో పాటు.. వారి భవిష్యత్ బంగారుమయం చేయాలనే సదుద్దేశంతో మార్గదర్శి పనిచేస్తుందని వివరించారు. వినియోగదారులకు ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా పరిష్కరించడంతోపాటు మిగతా సంస్థల కంటే ముందుగా కేవలం పది రోజుల్లోనే చిట్టి డబ్బులు చెల్లిస్తూ వారి ఆదరాభిమానాలు పొందుతున్నామని తెలిపారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.