‘ఆచార్య’ స్టోరీ కొరటాల శివదే!
close

తాజా వార్తలు

Published : 28/08/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’ స్టోరీ కొరటాల శివదే!

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి కీలక పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవల చిరు పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కత్తి పట్టుకుని చిరు నిలబడిన ఈ లుక్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ స్టోరీ కాపీనంటూ వార్తలు వెలువడ్డాయి. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘ఆచార్య’ స్టోరీ, కాన్సెప్ట్‌ కొరటాల శివ సొంతంగా రాసుకున్నది. కథ కాపీ చేసి సినిమా తీస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు రచయితలు అసత్య ప్రచారానికి దిగారు. ఈ సినిమా స్టోరీ చాలా గోప్యంగా ఉంచాం. అసలు కథేంటన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మోషన్‌ పోస్టర్‌ చూసి, కొందరు ‘ఆచార్య’ కథ తమదేనని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కొరటాల శివలాంటి పేరున్న దర్శకుడిపై ఈ విధమైన ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘ఆచార్య’ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం’’ అని తెలిపింది.

కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్‌ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్‌. తాజా మోషన్‌ పోస్టర్‌ చూస్తుంటే కథ అదేనని అర్థమవుతోంది. అయితే, కొరటాల శివ టేకింగ్‌, చిరంజీవి నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్‌చరణ్‌ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్‌ కథనాయిక. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని