
తాజా వార్తలు
మేడారంలో దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా
తాడ్వాయి: మేడారం సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని జిల్లా వైద్యాధికారి అప్పయ్య తెలిపారు. ఈ నెల 24న మొదలైన మేడారం చిన్నజాతర ఇవాళ్టితో ముగిసింది. గత నాలుగు రోజులుగా ఉద్యోగులు ఇద్దరూ విధుల్లో ఉన్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తూ భక్తులకు సేవలందించే క్రమంలో ఉద్యోగులిద్దరూ అస్వస్థకు గురైనట్లు అప్పయ్య చెప్పారు. దీంతో వీరిద్దరికీ స్థానిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలిందన్నారు. ఉద్యోగులను హోమ్ క్వారంటైన్‌కు తరలించామని వైద్యాధికారి వెల్లడించారు.
ఇవీ చదవండి
Tags :