విశాఖకు మదనపల్లె జంటహత్యల నిందితులు
close

తాజా వార్తలు

Updated : 30/01/2021 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖకు మదనపల్లె జంటహత్యల నిందితులు

తిరుపతి: చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పద్మజ, పురుషోత్తంనాయుడిని విశాఖ కస్టోడియన్‌ కేర్‌కు తరలించాలని రుయా వైద్యులు సూచించారు. వారి మానసికస్థితి సరిగా లేనందున.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించాలని రెండు రోజుల క్రితం జైలు అధికారులకు వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో శుక్రవారం ఉదయం నిందితులను జైలు నుంచి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. నిందితులిద్దరికీ మానసిక సమస్యలు ఉన్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో పురుషోత్తం, పద్మజకు కస్టోడియన్‌ కేర్‌ కావాలని వైద్యులు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో జైలు వాతావరణంలోనే చికిత్స అందించేందుకు వీలుగా సరైన వ్యవస్థ ఉండాలన్నారు. జైలులో అలాంటి వసతులు లేనందునే విశాఖలోని కస్టోడియన్‌ కేర్‌కు నిందితులను తరలించాలని సిఫార్సు చేసినట్లు రుయా వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి..

అందరితో కలిపి నన్నూ ఉంచండి

అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని