
తాజా వార్తలు
భాజపాలో చేరిన ‘మెట్రోమ్యాన్’
తిరువనంతపురం: మెట్రోమ్యాన్‌గా పేరుగాంచిన ఈ. శ్రీధరన్ భాజపాలో చేరారు. ఇటీవల తాను కాషాయ దళంలో చేరనున్నట్టు ప్రకటించిన ఆయన గురువారం రాత్రి మలప్పురంలో అధికారికంగా భాజపాలో చేరారు. కేంద్రమంత్రి ఆర్కే సింగ్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ 88 ఏళ్ల మెట్రో మ్యాన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. కమలం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సీఎం పదవి చేపట్టేందుకు తాను సిద్ధమేనన్నారు. భాజపా కోరితే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, అయితే, తన ప్రధాన లక్ష్యం కేరళలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమేనంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దేశంలో అనేక మెట్రో రైలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో శ్రీధరన్ కీలక పాత్ర పోషించారు.
ఇవీ చదవండి
Tags :