
తాజా వార్తలు
పాలు అమ్మడానికి హెలికాప్టర్ కొన్నాడు!
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వృద్ధురాలు తమ పొలానికి వెళ్లే మార్గాలను గ్రామ పెద్ద మూసివేయడంతో.. హెలికాప్టర్ కొనుగోలు చేయడానికి రుణం ఇప్పించమని రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఓ పాడిరైతు పాలు అమ్మడం కోసం ఏకంగా హెలికాప్టర్‌నే కొనుగోలు చేశాడు. మహారాష్ట్రలోని భివండికి చెందిన పాడి రైతు జనార్ధన్ బోయర్ ఈ మధ్య స్వయంగా పాల వ్యాపారం మొదలుపెట్టాడు. వ్యాపారంలో భాగంగా పంజాబ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందట. రైలు, బస్సుల్లో వెళ్తే ఎక్కువ సమయం పడుతుండటంతో స్నేహితుడి సలహా మేరకు హెలికాప్టర్ కొనుగోలు చేశాడు. ఇందుకోసం రూ.30 కోట్లు ఖర్చు పెట్టాడు.
ఇప్పటికే హెలికాప్టర్‌ను తన గ్రామానికి తీసుకొచ్చి ట్రయల్స్ వేశారట. హెలికాప్టర్ కోసం తన రెండున్నర ఎకరాల స్థలంలో గ్యారేజ్ కట్టిస్తున్నాడు. అలాగే, పైలట్.. టెక్నిషియన్ కోసం ప్రత్యేకంగా గదులు నిర్మిస్తున్నాడు. మార్చి 15న హెలికాప్టర్‌ను జనార్ధన్ ఇంటికి డెలివరీ చేస్తారట. జనార్ధన్‌కు భివండిలో పలు గోదాములు ఉన్నాయి. దీంతో ఆదాయం భారీగానే వస్తుంది. అలా వచ్చిన డబ్బుతో పాలు అమ్మడం కోసం హెలికాప్టర్‌ను కొన్నాడు.