చిన్న కారణానికి బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించాడు.. మీరు మాత్రం ఇలా చేయకండే!

తాజా వార్తలు

Published : 24/10/2021 01:28 IST

చిన్న కారణానికి బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించాడు.. మీరు మాత్రం ఇలా చేయకండే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంక్‌కి వచ్చిన ఓ చైనీస్‌ మిలియనీర్‌కి అక్కడి సిబ్బంది తీరుకి చిర్రెత్తుకొచ్చింది. కోపంతో తన ఖాతాలో ఉన్న ఐదు మిలియన్ల యువాన్లు విత్‌డ్రా చేశాడు. మన రూపాయాల్లో చెప్పాలంటే రూ.5.7కోట్లు. డ్రా చేసిన డబ్బుని బ్యాగుల్లో కుక్కుకొని వెళ్లిపోలేదా ఆసామి. అందులో ఏదో తేడా ఉందని చెప్పి ఆ మొత్తాన్ని తన కళ్లముందే లెక్క పెట్టాలన్నాడు. ఇదేం బాధరా నాయనా అనుకుంటూ స్టాఫ్‌ అంతా కలిసి పొద్దంతా కష్టపడి లెక్క అప్పజెప్పారు. కట్టలకొద్దీ నోట్లను ఒక్కొక్కటిగా లెక్కించారు.

కథ అంతటితో ముగిసిపోలేదు. ‘రోజుకి ఐదు మిలియన్ల యువాన్ల పరిమితి నిబంధన ఉండటంతో ఈరోజు ఇంతటితో వదిలేశాను. రేపొచ్చి నా ఖాతా మొత్తం ఖాళీ చేస్తాను’ అని బ్యాంకు సిబ్బందికి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు ఆ మిలియనీర్‌. ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అయ్యాయి. ఇంతకీ ‘సన్‌వేర్‌’ అనే ఆ ధనికుడి కోపానికి కారణం ఏంటో తెలుసా? బ్యాంక్‌కి వచ్చినప్పుడు మాస్కు ధరించమని అక్కడి భద్రతా సిబ్బంది తనకి కొంచెం దురుసుగా చెప్పాడట. అదీ మ్యాటర్‌. మాస్క్‌ పెట్టుకోమన్నందుకు మీరు మాత్రం అలాచేయకండే!!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని