తెలంగాణలో యథావిధిగా మినీ పోరు
close

తాజా వార్తలు

Updated : 22/04/2021 18:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో యథావిధిగా మినీ పోరు

హైదరాబాద్‌: తెలంగాణలో ఖమ్మం, వరంగల్‌ నగరపాలక సంస్థ ఎన్నికలు (మినీ పోరు) యథావిధిగా జరగనున్నాయి. ఎన్నికల సమయంలో కొవిడ్‌ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ దృష్ట్యా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి (ఎస్‌ఈసీ) వెల్లడించారు. అధికారులతో చర్చించి ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆదేశించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించినట్లు చెప్పారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం నిలిపివేయాలని వివిధ రాజకీయ పార్టీలకు ఎస్ఈసీ సూచించారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని