పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నాం : బొత్స
close

తాజా వార్తలు

Published : 01/04/2020 11:54 IST

పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నాం : బొత్స

అమరావతి : కరోనా కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతులు పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. కార్మికులు, కూలీలకు ఆహారం, తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. సమాజిక దూరం పాటించేలా రైతుబజార్ల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు సంచార దుకాణాల ద్వారా నిత్యావసరాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్నామని తెలిపారు. ఎవరికి కరోనా అనుమానిత లక్షణాలున్నా వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 87కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఒక్కరోజే 43 కేసులు నమోదు కావడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని