ఆ మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు: బొత్స
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 20:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు: బొత్స

రాజమహేంద్రవరం: మూడు రాజధానులు తమ ప్రభుత్వ విధానమని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో కోర్టును ఒప్పించి, వాస్తవాలు చెబుతామని.. సమస్యలన్నీ అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని.. ఆ ప్రక్రియలోనే ఉన్నామని బొత్స చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి వున్న అద్భుతమైన అవకాశాన్ని గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో మిగిలిన 32 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని మంత్రి చెప్పారు. విలీన గ్రామాలను కలిపి రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రాజమహేంద్రవరాన్ని మోడల్‌ నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని