TV ఉంటే రేషన్‌కార్డు బంద్‌పై మంత్రి యూటర్న్‌
close

తాజా వార్తలు

Updated : 16/02/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TV ఉంటే రేషన్‌కార్డు బంద్‌పై మంత్రి యూటర్న్‌

బెంగళూరు: టీవీ, ఫ్రిజ్‌ లాంటి వస్తువులుంటే రేషన్‌ కార్డులు వదులుకోవాలంటూ కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి చేసిన ప్రకటన తీవ్ర దుమారానికి దారితీసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై మంత్రి వెనక్కి తగ్గారు. రేషన్‌ బియ్యం కార్డుల కోసం ఎలాంటి కచ్చితమైన పరిమితులు లేవని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

తన వ్యాఖ్యలపై నేడు స్పందించిన మంత్రి ఉమేశ్‌.. ‘దిల్లీ నుంచి నాకు వచ్చిన సమాచారాన్ని నేను మీడియాతో పంచుకున్నారు. టీవీ, ఫ్రిజ్‌ లాంటి పరిమితులపై నేను గానీ, ముఖ్యమంత్రి యడియూరప్ప గానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వడంలేదు. మా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు కట్టుబడి ఉంది’ అని చెప్పారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.

బెళగావిలో సోమవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఉమేశ్ మాట్లాడుతూ రేషన్‌ కార్డులపై సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టీవీ, ఫ్రిజ్‌, ద్విచక్రవాహనం, ఐదెకరాల భూమి ఉన్నవారు బీపీఎల్‌ రేషన్‌ కార్డులు వదులుకోవాలని లేదంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్‌ తీవ్రంగా మండిపడ్డాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని