ఈ సమయంలో ధర్నాలు చేయొద్దు: ఈటల
close

తాజా వార్తలు

Published : 15/04/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ సమయంలో ధర్నాలు చేయొద్దు: ఈటల

హైదరాబాద్‌: కరోనా మొదటి వేవ్‌కు రెండో వేవ్‌కు చాలా తేడా ఉందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మొదటి వేవ్‌లో 20 శాతం మంది ఆస్పత్రుల్లో చేరితే.. రెండో వేవ్‌లో 95 శాతం మంది బాధితులకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కొవిడ్‌ కేసుల పెరుగుదల దృష్ట్యా ఇవాళ హైదరాబాద్‌లోని టిమ్స్‌, గాంధీ, కింగ్‌ కోఠి ఆస్పత్రులను ఈటల సందర్శించారు. ఆస్పత్రుల్లోని సౌకర్యాలు, ఏర్పాట్లు, సిబ్బంది, ఔషధాల లభ్యతను మంత్రి పరిశీలించారు. అనంతరం రాష్ట్రంలోని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 వేల పడకల్లో సగానికిపైగా కొవిడ్‌కు వాడుతున్నామని వెల్లడించారు. సీరియస్‌ కేసులు వస్తే ప్రైవేటు ఆస్పత్రులు గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ సమయంలో ఎవరూ ధర్నాలు చేయొద్దని.. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం, టెస్టులు వేగంగా నిర్వహించడంలో గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు కీలకంగా వ్యవహరించాలన్నారు. ఎక్కువ మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉండేలా కొవిడ్‌ బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల్లో కొవిడ్ రోగులకి అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైరస్ బారినపడి చనిపోయినవారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే విషయంలో గ్రామ పంచాయతీ, స్థానిక మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని