అవసరమైతేనే బయటకు రండి: ఈటల
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవసరమైతేనే బయటకు రండి: ఈటల

హైదరాబాద్‌: దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో అప్రమత్తమైనట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కొవిడ్‌ భారీగా విజృంభిస్తోందని.. అందువల్ల రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. కరోనా విపత్తు సమయంలో కీలకంగా పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌ అందరికీ ఇప్పటికే వ్యాక్సిన్‌ అందించామన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇస్తున్నామని చెప్పారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు పెంచామని, నిర్ణీత సమయంలో వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని