ఆ నిర్ణయం బాధాకరం: ఈటల
close

తాజా వార్తలు

Updated : 22/04/2021 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ నిర్ణయం బాధాకరం: ఈటల

హైదరాబాద్‌: రాష్ట్రానికి 4లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఆర్డర్‌ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దీనిపై తాము నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్‌లాగే రెమిడెసివిర్‌ కూడా తమ అధీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో కేవలం తెలంగాణ ప్రాంత రోగులే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, కర్ణాటక రోగులు కూడా చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను తమకే కేటాయించాలని ఈటల కోరారు.

రాష్ట్రంలో రోజుకు 384 టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉందని ఈటల తెలిపారు. ప్రస్తుతం రోజుకు 260-270 టన్నుల ఆక్సిజన్‌ వస్తోందని, ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదని చెప్పారు. అక్కడక్కడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆక్సిజన్‌ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అన్నారు. తమిళనాడు నుంచి 30 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించినట్లు చెప్పారు. అయితే, తమిళనాడు మాత్రం టన్ను కూడా ఇవ్వబోమని చెబుతోందన్నారు. తమిళనాడు తరహాలో తాము వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ఈటల ప్రశ్నించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని