రోజుకు 10లక్షల మందికి టీకా: ఈటల
close

తాజా వార్తలు

Updated : 20/01/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోజుకు 10లక్షల మందికి టీకా: ఈటల

రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నస్టిక్‌ సెంటర్లు

హైదరాబాద్: ప్రజారోగ్యం విషయంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వైద్య పరీక్షల ఖర్చు తగ్గించేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. కరోనా వ్యాక్సినేషన్‌లోనూ తెలంగాణ తనదైన ముద్ర వేసిందన్న మంత్రి.. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా తయారైన కొవాగ్జిన్‌ మరింత సమర్థవంతంగా పని చేస్తుందని ఆశిస్తున్నట్లు ఈటల తెలిపారు. త్వరలోనే ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి టీకా పంపిణీ చేస్తామన్నారు. 

‘నిన్న కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ తెలంగాణలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం గొప్పగా జరుగుతోందని కితాబిచ్చింది. అనేక రకాల వ్యాక్సిన్ల పంపిణీలో మెరుగైన రికార్డు రాష్ట్రానికి ఉంది. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి తెలంగాణలో 9800 మంది నిష్ణాతులకు శిక్షణ ఇచ్చి.. ఒకే రోజులో పది లక్షల మందికి టీకా ఇచ్చే సత్తా రాష్ట్రానికి ఉంది. అన్ని స్థాయుల ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. రెండో విడతలో భాగంగా రాష్ట్రానికి మూడున్నర లక్షల వ్యాక్సిన్‌ వచ్చింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. వ్యా్క్సిన్‌ తీసుకున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదు. కొవాగ్జిన్‌ డోసులు ప్రస్తుతం 20 వేలు వచ్చాయి. భవిష్యత్తులో వాటి సంఖ్య పెరుగుతుంది’ అని మంత్రి అన్నారు. 

రాష్ట్రంలోని ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారందరికీ వ్యాక్సిన్‌ ఇస్తామని ఈటల పేర్కొన్నారు. కరోనాకు నిర్ధరణకు ర్యాపిడ్‌ టెస్టులు వేల సంఖ్యలో నిర్వహిస్తున్నామని.. అవసరమైతే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వివరించారు.

ఇవీ చదవండి..
ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టు కీలక ఆదేశం 

ప్రతి హిందువు భాగస్వామి కావాలి: బండిTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని