
తాజా వార్తలు
తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అదే: ఈటల
హైదరాబాద్: బడుగు బలహీన కులాలు అన్నిరంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి మంత్రులు ఈటల రాజేందర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం దాదాపు 40 కుల సంఘాలకు స్థాలాలు కేటాయించిందని తెలిపారు. బీదవర్గాలకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..ప్రభుత్వాలు ఉంటాయి..పోతాయి... కానీ, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని అన్నారు. చాలా పార్టీలు సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నాయని విమర్శించారు. అలాంటి పార్టీలకు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు వెనకబడిన కులాలను ఓటు బ్యాంకుగా మార్చుకున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెరాస ప్రభుత్వం ఒక్కో కులానికి ఒక్కో భవనం కేటాయించిందని చెప్పారు. హక్కుల ద్వారా సమస్యలు పరిష్కరించుకొని ఐక్యత పాటిద్దామని ఎంపీ కేశవరావు తెలిపారు. బీసీలంతా ఐక్యంగా ఉండాలన్నారు.
ఇవీ చదవండి..
ఈసీని సవాలు చేసే అధికారం సీఎంకు లేదు
కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు :బండి సంజయ్