‘‘బంగారు తెలంగాణ అంటే బతుకుదెరువు’’
close

తాజా వార్తలు

Updated : 27/03/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘బంగారు తెలంగాణ అంటే బతుకుదెరువు’’

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌: బంగారు తెలంగాణ అంటే బతుకుదెరువు కల్పించడమే అని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నగరంలోని నెక్లెస్‌రోడ్‌ హెచ్‌ఎండీసీ మైదానంలో ఇవాళ సంచార చేపల వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ, 29 జిల్లాలకు 117 సంచార చేపల వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలోని చెరువులకు మహర్దశ వచ్చింది. గతంలో మత్య్స పరిశ్రమ అంటే కోస్తా పరిశ్రమగా ఉండేది. ఆ నానుడిని తెరాస ప్రభుత్వం చెరిపేసింది. చేపల దిగుమతి స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. రాష్ట్రంలో మంచినీరు అత్యంత మధురంగా ఉంటుంది. ఇక్కడ మంచినీళ్లలోనే చేపలను పెంచుతున్నారు. మంచినీళ్లలో పెరిగే చేపలకు రుచి, డిమాండ్‌ ఎక్కువ. తెలంగాణలో చేపలపై వచ్చే ఆదాయం రెట్టింపైంది. మత్య్స పరిశ్రమకు అనుబంధంగా ఇతర పరిశ్రమలను స్థాపిస్తాం. ఉచితంగా చేపలు, రొయ్యలు పంపిణీ చేస్తున్నాం’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొ్న్న మంత్రి తలసాని మాట్లాడుతూ.. ‘‘గతంలో ఏ ప్రభుత్వం మత్య్సకారులను పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక బడ్జెట్లో మత్స్యశాఖకు రూ.100 కోట్లు కేటాయించాం. మిషన్‌ కాకతీయ, ఇతర ప్రాజెక్టుల ద్వారా నీటి వనరులు పెరిగాయి. ఉచిత చేపపిల్లల పంపిణీతో ఉత్పత్తి పెరిగింది. సంచార వాహనాల ద్వారా మత్స్యకార మహిళలకు ఉపాధి కల్పించా’’ అని అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని