close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 01/06/2020 18:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరిపాలన రాజధానిగా విశాఖ మారుతోంది

విశాఖ: విశాఖ పరిపాలన రాజధానిగా మారుతోందని మంత్రి కన్నబాబు అన్నారు. నగరంలో తాగునీటి సమస్య, భూ ఆక్రమణలు తదితర అంశాలపై చర్చించామని తెలిపారు. ఈ మేరకు ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో భూ ఆక్రమణలకు తావు ఇవ్వకూడదని మంత్రి కన్నబాబు అన్నారు. విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీన్ని పరిగణలోకి తీసుకుని త్వరలో తాగునీటి కోసం ఒక ప్రాజెక్టును సీఎం జగన్‌ ప్రారంభిస్తారని చెప్పారు.

ప్రభుత్వ భూముల అమ్మకం అనేది ఈ రోజు మొదలైంది కాదని, చంద్రబాబు హయాంలో కూడా జరిగిందన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకం విషయంలో ప్రజాస్వామ్య విధానంలో వైకాపా సర్కారు బహిరంగ వేలం వేస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసమే వీటిని అమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు. జనావాసాల మధ్య ప్రమాదకర పరిశ్రమలు లేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఈ సందర్భంగా వివరించారు.

మిడతల భయం లేదు..

రాష్ట్రానికి మిడతల దండు భయం లేదని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పారు. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నవి స్థానిక మిడతలే తప్ప మరొకటి కావని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే సీఎస్‌ నీలం సాహ్ని నేతృత్వంలో అన్ని జిల్లా అధికారులతో సమీక్ష జరిపి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు మంత్రి వివరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.