
తాజా వార్తలు
ఉద్యోగుల పనితీరుతో అద్భుతఫలితాలు: కేటీఆర్
డైరీ ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల పనితీరుతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యుత్ ఇంజినీర్ల సంఘం డైరీ, క్యాలెండర్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రగతిభవన్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. ఉద్యమ సమయంలో ఉద్యమనేతగా కేసీఆర్ ఇచ్చిన 24గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ హామీని నెరవేర్చడంలో ఆ సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది తోడ్పాటు ఉందన్నారు. సాధక బాధకాలు తెలిసిన వారికే యాజమాన్య బాధ్యతలు అప్పగించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని సీఎం కేసీఆర్ రుజువు చేశారన్నారు. సీఎం ఆలోచనల మేరకు రాష్ట్రంలో వెలుగులు విరజిమ్ముతున్న విద్యుత్ శాఖ మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆకాంక్షించారు.
ఇవీ చదవండి..
బైక్ అంబులెన్స్ రూపొందించిన డీఆర్డీవో
మరోసారి అఖిలప్రియ బెయిల్ పిటిషన్