close

తాజా వార్తలు

Published : 01/03/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ITIRకు ప్రత్యామ్నాయం చూపించండి: కేటీఆర్‌

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్: తెలంగాణలో ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రకటించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఐటీ రంగంలో అద్భుతాలు సాధిస్తున్న హైదరాబాద్‌ లాంటి నగరానికి ఐటీ క్లస్టర్‌ ఏర్పాటు సహా ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఐటీ క్లస్టర్‌ను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం స్పందిచకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. కొవిడ్ సంక్షోభంలో ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లోనూ తెలంగాణ ఐటీ ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయన్నారు. జాతీయ సగటు 1.9శాతం ఉండగా.. తెలంగాణ వృద్ధి రేటు 7 శాతంతో 1.40 లక్షల కోట్లతో ఉన్న విషయాన్ని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.

అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్‌మాన్ సాక్స్, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి కేటీఆర్‌ తీసుకెళ్లారు. కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎంటర్‌టైన్మెంట్ టెక్నాలజీస్ వంటి నూతన ఎమర్జింగ్ టెక్నాలజీలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, నైపుణ్య శిక్షణ వంటి రంగాల్లో ప్రభుత్వం వినూత్న విధానాల ద్వారా అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనంత గొప్పగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు హైదరాబాద్‌లో ఉన్న టీహబ్, టీవర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వంటి అనేక సంస్థలు ఏర్పాటే కారణమన్నారు. ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వ చొరవతో ఐటీ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్‌ అన్నారు.

‘‘హైదరాబాద్ నగరానికి కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రధాని మోదీని కలిసి ప్రాజెక్టు అంశంపై ముందుకు వెళ్లాల్సిందిగా కోరారు. కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ఐటీఐఆర్ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమల ప్రాధాన్యతను కేంద్రం గుర్తించాలి. లక్షలాది మందికి నూతన ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐటీఐఆర్‌కు సమానమైన ప్రత్యేక విధానాన్ని హైదరాబాద్‌కు అందించాలి’’ అని కేటీఆర్‌ తెలిపారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని