
తాజా వార్తలు
మంత్రి కేటీఆర్‌కు స్కోచ్ అవార్డు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. 2020 సంవత్సరంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు ‘‘బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్’’గా కేటీఆర్‌ను ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూపు వెల్లడించింది. అలాగే పలు ఇన్నోవేటివ్, ఈ-గవర్నెన్స్ ఇన్షియేటివ్తో ప్రత్యేకత చాటిన తెలంగాణ రాష్ట్రాన్ని ‘‘ఈ-గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’’గా ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ కేటీఆర్‌కు అందజేశారు. రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
Tags :