ఆయిల్‌ పామ్‌ సాగుతో లాభమే: నిరంజన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Published : 28/03/2021 16:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయిల్‌ పామ్‌ సాగుతో లాభమే: నిరంజన్‌రెడ్డి

సిద్దిపేట: తెలంగాణలో స్థిరమైన లాభసాటి సాగు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సిద్దిపేటలో ఆయిల్‌ పామ్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తయితే 1.20 కోట్ల ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్నారు. పత్తి ఉత్పత్తి, నాణ్యతలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చామని వెల్లడించారు. నీళ్లు ఉన్నాయని రైతులంతా వరి సాగు చేస్తే నష్టపోతారన్నారు. దేశానికి 21 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ అవసరమని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఏటా రూ.90 వేల కోట్ల ఆయిల్‌ పామ్‌ దిగుమతి అవుతోందన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగుతో లాభమే తప్పా నష్టం ఉండదని చెప్పారు. ఆయిల్‌ పామ్‌ సాగుతో పాటు అంతర పంటగా ఏదైనా సాగు చేయొచ్చన్నారు. వచ్చే ఆరేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేసే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని