‘తెదేపా గెలిస్తే మా ఎంపీలంతా రాజీనామా’
close

తాజా వార్తలు

Updated : 11/04/2021 14:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘తెదేపా గెలిస్తే మా ఎంపీలంతా రాజీనామా’

మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌

తిరుపతి: ప్రజాహిత కార్యక్రమాలే వైకాపాకు బలమని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామన్న ఆయన .. తెలుగుదేశం గెలిస్తే తమ ఎంపీలంతా రాజీనామాకు సిద్ధమన్నారు. వైకాపా అభ్యర్థి గెలిస్తే తెలుగుదేశం ఎంపీలు ముగ్గురు, వారి వద్ద ఉన్న రఘురామకృష్ణరాజు రాజీనామా చేస్తారా అని సవాల్‌ విసిరారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తికి మద్దతుగా ఆదివారం ఉదయం వైకాపా నేతలతో కలిసి తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. భాజపా, జనసేన, తెదేపా మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. పాచిపోయిన లడ్డూ ఇప్పుడు పవన్‌కు తాజా లడ్డూ అయ్యిందా? అని ప్రశ్నించారు. భాజపా రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు. సునీల్‌ దియోధర్‌ ఎలాంటి వ్యక్తో మేఘాలయ ప్రజలకు తెలుసని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా తీవ్రత దృష్ట్యానే సీఎం సభ రద్దు చేసుకున్నారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని