close

తాజా వార్తలు

Updated : 01/03/2021 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పర్యటన కుదరదని ముందే చెప్పారు: పెద్దిరెడ్డి

తిరుపతి: కరోనా ఆంక్షలు, ఎన్నికల కోడ్‌ వల్లే తెదేపా అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కొవిడ్‌, ఎన్నికల నిబంధనలతో పర్యటన కుదరదంటూ పోలీసులు ఆయనకు ముందే చెప్పారన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు.  ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలిసినా కేవలం శాంతిభద్రతల సమస్య సృష్టించి ప్రజలను ఆకట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు విమానాశ్రయంలో బైఠాయించిన తెదేపా అధినేత చంద్రబాబు తన నిరసనను కొనసాగిస్తున్నారు. ఆయన్ను తిరిగి హైదరాబాద్‌ పంపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యాహ్నం 3.10 గంటలకు స్పైస్‌జెట్‌ విమానంలో పంపేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ అక్కడి నుంచి కదిలేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో సాయంత్రం 7.15 గంటలకు ఇండిగో విమానంలో హైదరాబాద్‌ పంపేందుకు పోలీసులు మరోసారి టికెట్లు బుక్‌ చేశారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని