‘విజయవాడలో ఓట్లకోసం ఎలా వచ్చారు?’
close

తాజా వార్తలు

Updated : 07/03/2021 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘విజయవాడలో ఓట్లకోసం ఎలా వచ్చారు?’

చంద్రబాబును నిలదీసిన పేర్ని నాని

అమరావతి: రాజధాని అమరావతి పేరుతో గుంటూరు, విజయవాడ నగరాలను నాశనం చేసిన తెదేపా అధినేత చంద్రబాబు.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎలా వచ్చారని ఏపీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. ఉపాధి కల్పనకు ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు.

‘‘ప్రజల ఆశలు, ఆకాంక్షలను మీరు దోచుకున్నారు. అమరావతిలో ఏం చేశారు? తాత్కాలిక అమరావతిగా తెలుగు ప్రజల్ని అవమాన పరిచారు. విజయవాడలో ఒక్క బైపాస్‌ నిర్మాణమైనా చేశారా? నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఏమైనా చేశారా? విజయవాడలో ఐటీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేశారా?’’ అని చంద్రబాబును నాని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కేంద్రంలో పరపతి ఉంటే విశాఖ ఉక్కు కోసం ఏదైనా చేసి చూపాలని హితవు పలికారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని