
తాజా వార్తలు
సులభతర పాలనే కేసీఆర్ లక్ష్యం
రోడ్లు, భవనాల శాఖ సమీక్షలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ఈ నెలలో ప్రారంభిస్తారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన ఆయన వివిధ అంశాలపై చర్చించారు. పాలన సులభతరం చేయాలనేది సీఎం ఆలోచన అని వివరించారు. ప్రజలకు అందుబాటులో.. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న మిగతా కలెక్టరేట్ల పనులు త్వరతగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
సీఎం ఆలోచనల ప్రకారం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా యాదాద్రి రూపుదిద్దుకుంటోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రెసిడెన్సియల్ సూట్, 13 విల్లాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. పుష్కరిణి, కల్యాణ కట్ట పనులు ఈ నెలలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి రింగ్‌రోడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిపై ప్రతివారం ఈఎస్సీ సమీక్షించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు