
తాజా వార్తలు
క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం: తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోకాపేటలో ఇటీవల జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో తాను గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
తన వ్యాఖ్యలు ఏమైనా తప్పుగా ఉన్నాయని భావిస్తే గంగపుత్రులకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తలసాని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి గంగపుత్రుల సంక్షేమం, అభివృద్ధి పట్టించుకున్న వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మత్స్యకార సొసైటీలలో వివిధ వర్గాల వారు సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రులు, బెస్త, ముదిరాజ్‌లకు మేలు చేయాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమని పేర్కొన్నారు.
ఇవీ చదవండి...
గోల్కొండపై భాజపా జెండా ఎగరేస్తాం: బండి