దాడుల వెనుక ప్రతిపక్షం హస్తం: చెల్లుబోయిన
close

తాజా వార్తలు

Published : 03/01/2021 12:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాడుల వెనుక ప్రతిపక్షం హస్తం: చెల్లుబోయిన

తిరుమల: రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక కుట్రకోణం దాగిఉందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని అస్తిర పరిచేందుకు ప్రతిపక్షం కుట్రచేస్తోందన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన, రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటన వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో దేవాలయాల కూల్చివేత, గోశాలలు రక్షించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దేవుడి దయతో త్వరలోనే విగ్రహాల ధ్వంసం కేసు నిందితులు దొరుకుతారని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి..

రామతీర్థంలో భాజపా దీక్ష భగ్నం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని