తెలంగాణలో తొలి కరోనా కేసుకు ఏడాది
close

తాజా వార్తలు

Updated : 02/03/2021 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో తొలి కరోనా కేసుకు ఏడాది

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా తొలి కేసు వెలుగుచూసి నేటికి ఏడాది పూర్తయింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాష్ట్రంలో కరోనా మహమ్మారి జాడ వెలుగు చూసింది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడికి వైరస్‌ సోకినట్లు గుర్తించి గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా కరోనా సోకిన తొలి బాధితుడు, ఆరోగ్య సిబ్బందితో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనాపై పోరాటంలో గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిర్విరామ కృషి చేశారని ఈటల, తలసాని కొనియాడారు. రాబోయే రోజుల్లో గాంధీ ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు అందించనున్నట్లు వివరించారు. 

‘వైరస్‌ వస్తే శవాల గుట్టలే ఉంటాయని అందరం భయపడ్డాం. దేశంతో పాటు రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితి తలెత్తలేదు. వైద్యులు, సమాజం సహకారంతో బయటపడుతున్నాం. వైద్య సిబ్బంది, ప్రభుత్వ శాఖలు నిర్విరామంగా పనిచేశాయి. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది ఎనలేని సేవ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులపై గతంలో వ్యతిరేకభావం ఉండేది. కరోనా సమయంలో సేవలు అందించి చెడ్డపేరు తొలగించారు. ఇతర వైరస్‌ల లాగే కరోనాతో సహజీవనం చేయాల్సిందే. పేదలకు గాంధీ ఆస్పత్రి వరంగా మారింది. గాంధీ తెలంగాణకు వెలుతురు ఇచ్చే ఆస్పత్రి. ఇలాంటి వైద్య సేవలను జిల్లాల్లో కూడా అందిస్తాం. కరోనా అనేక రకాల అనుభవాలు నేర్పింది. భవిష్యత్తులో కరోనా సోకకుండా, ఒకవేళ సోకినా దాని నుంచి బయటపడేలా ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించడానికి వైద్యులందరూ మేధోమథనం చేయాలి. కరోనా విపత్కాలంలో తోడుగా ఉన్న వైద్యులను ఎంతగా అభినందించినా తక్కువే’ అని మంత్రి ఈటల అన్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని