గొడవ.. ఏఎస్పీపై కారు ఎక్కించే యత్నం
close

తాజా వార్తలు

Published : 31/03/2021 13:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గొడవ.. ఏఎస్పీపై కారు ఎక్కించే యత్నం

బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారిపై ఓ వ్యక్తి కారు ఎక్కించేందుకు ప్రయత్నించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర కన్నడ జిల్లా హట్టికేరి టోల్‌గేట్‌ సిబ్బందితో వాహనదారుడు గొడవకు దిగాడు. ఈ వివాదాన్ని గమనించిన ఏఎస్పీ భద్రీనాథ్‌ అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులతోనూ వాదనకు దిగిన సదరు వ్యక్తి ఒక్కసారిగా ఏఎస్పీ మీదకు కారు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. కారు తగిలి బద్రీనాథ్‌ కిందపడగా గన్‌మెన్‌ పైకి లేపాడు. అయినా ఆగని వాహనదారుడు కారును ఆపకుండా అక్కడినుంచి పారిపోయాడు. ఈ దుస్సాహసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని