
తాజా వార్తలు
ధానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద ధానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు లూప్‌లైన్ నుంచి మెయిన్‌లైన్‌కు మారుతున్న క్రమంలో బోగీల నుంచి ఇంజిన్ విడిపోయింది. బోగీలు స్టేషన్ ఘన్పూర్ రైల్వే గేటు వద్ద ఆగిపోయాయి. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఇంజిన్‌ను వెనక్కి రప్పించి బోగీలకు తగిలించారు. అరగంట తర్వాత రైలు కాజీపేట మీదుగా ధానాపూర్కు బయలుదేరి వెళ్లింది. వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :