వెంగయ్య మృతితో సంబంధం లేదు: అన్నా రాంబాబు
close

తాజా వార్తలు

Updated : 24/01/2021 17:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంగయ్య మృతితో సంబంధం లేదు: అన్నా రాంబాబు

అమరావతి: జనసేన కార్యకర్త వెంగయ్య మృతితో తనకెలాంటి సంబంధమూ లేదని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పష్టం చేశారు. తన కారు ఆపిన వెంగయ్యతో పాటు మరికొందరిని దూషించిన మాట వాస్తమేనని.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యాఖ్యలు తరచుగా వాడేవేనని చెప్పారు. చందు అనే వ్యక్తిని తాను తిట్టాను తప్ప వెంగయ్యను కాదని వివరించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాంబాబు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో సహజంగా మాట్లాడే భాష వాడితే దాన్నే హైలైట్‌ చేశారన్నారు. వెంగయ్యతో వివాదమే లేదని.. తాను మాట్లాడింది చందుతో అని చెప్పారు. జనసేన నేతలు చనిపోయిన వ్యక్తులను అడ్డుపెట్టుకుని శవరాజకీయాలు చేస్తున్నారని అన్నా రాంబాబు ఆరోపించారు. ఆ తరహా రాజకీయాలతో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

ఇవీ చదవండి..

ఏపీ ప్రభుత్వం పిటిషన్: విచారణ బెంచ్‌ మార్పు ప్రభుత్వం టార్గెట్లు పెట్టడం సరికాదు: కిషన్‌రెడ్డి

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని