కరోనా కంటే ముందే రాష్ట్రం దివాళా : జగ్గారెడ్డి
close

తాజా వార్తలు

Published : 01/07/2020 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కంటే ముందే రాష్ట్రం దివాళా : జగ్గారెడ్డి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ రాక ముందే తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ... రైతుబంధు సాయం అడపా దడపా జరీ చేసి ప్రకటనలు మాత్రం ఘనంగా ఇచ్చారని  మండిపడ్డారు. పేద కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసరాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. కరోనాకు ఇప్పట్లో మందు వచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యం, పోషకాహారం అందించాలని కోరారు.

‘‘కాంగ్రెస్‌ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కింద అనేక జబ్బులకు వైద్యం అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కూడా ఇచ్చే అవకాశం లేదు. సమైక్య రాష్ట్రంలో 90శాతం వైద్య ఖర్చులు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇచ్చేవారు. కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో పేదలు అవస్థలు పడుతున్నారు. కరోనా పాజిటివ్‌ కేసుల బులిటెన్‌ విడుదల కోసమే వైద్యశాఖ మంత్రి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన వద్ద ఎటువంటి అధికారాలు లేవు’’ అని జగ్గారెడ్డి విమర్శించారు. 

గాంధీ ఆసుపత్రిలో సదుపాయాలు లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. పేదలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయాలని కోరారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడంపై రెండు రోజుల్లో ప్రకటన రాకపోతే ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని