వెన్నుపోటుదారులను పార్టీ గుర్తించాలి: రోజా
close

తాజా వార్తలు

Updated : 10/03/2021 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెన్నుపోటుదారులను పార్టీ గుర్తించాలి: రోజా

నగరి: చిత్తూరు జిల్లా నగరి, పుత్తూరు పురపాలక ఎన్నికల్లో వైకాపా రెబల్‌ అభ్యర్థులపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైకాపా ఓటమికి కొందరు నేతలు పనిచేశారని.. తెదేపా గెలిచినా ఫర్వాలేదనే ఉద్దేశంతో 14మంది తిరుగుబాటు రెబెల్స్‌ను బరిలోకి దింపారని ఆమె ఆరోపించారు. వారు గెలిచేందుకు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం పనిచేసిన నేతలు మళ్లీ బరిలోకి దిగారని.. నగరి, పుత్తూరులో వైకాపా గెలవకూడదని కుట్రలు పన్నారని ఆరోపించారు. వెన్నుపోటుదారులను పార్టీ అదిష్ఠానం గుర్తించాలని రోజా విజ్ఞప్తి చేశారు. అన్ని కుట్రలనూ ఛేదించి నగరి, పుత్తూరులో వైకాపానే గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని