మోదీ ‘బంగ్లా’ పర్యటన కోడ్‌ ఉల్లంఘనే: దీదీ 
close

తాజా వార్తలు

Published : 28/03/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీ ‘బంగ్లా’ పర్యటన కోడ్‌ ఉల్లంఘనే: దీదీ 

ఖరగ్‌పూర్‌: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లడాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఎన్నికల వేళ ఆయన పొరుగు దేశంలో పర్యటించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు.  శనివారం ఖరగ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో దీదీ పాల్గొన్నారు. ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ బంగ్లాలో ఉపన్యాసాలు ఇస్తున్నారని, ఇదంతా కోడ్‌ ఉల్లంఘనేనని మండిపడ్డారు. 

బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శనివారం ఆయన ఒరఖండికి బెంగాల్‌కు చెందిన భాజపా ఎంపీ శాంతను ఠాకూర్‌తో కలిసి వెళ్లారు. అలాగే, బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. 

మరోవైపు, బెంగాల్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈరోజు 30 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. మధ్యాహ్నం 3గంటల సమయానికి 55శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని