close

తాజా వార్తలు

Published : 26/01/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోదీ చిత్రం: 24 గంటల్లో మిలియన్‌ లైక్స్‌

దిల్లీ: గతవారం పశ్చిమ్‌బెంగాల్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ షేర్‌ చేసిన చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన 24 గంటల్లోనే పది లక్షల మంది లైక్‌చేశారు. ఆ చిత్రంలో ప్రధాని శ్వేత వర్ణ దుస్తుల్లో కనిపించారు. 

స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా మోదీ శనివారం కోల్‌కతాలో పర్యటించారు. ఈ క్రమంలో ‘నేతాజీ బోస్‌కు నివాళులు అర్పించేందుకు కోల్‌కతా చేరుకున్నారు’ అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో ఒక చిత్రాన్ని షేర్ చేశారు. ఆ దృశ్యం నెటిజన్లను ఆకర్షించింది. 24 గంటల్లో దానికి పది లక్షల లైక్స్‌ వచ్చాయి. 14 వేలమంది దాన్ని షేర్ చేయగా..47,000మంది వ్యాఖ్యలు జోడించారు.  

కాగా, రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే మోదీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..నేతాజీ జయంతి ఉత్సవాల కోసం ఒకే వేదికపై కన్పించిన సంగతి తెలిసిందే. అదే రోజు ప్రధాని నేతాజీ భవన్‌ను కూడా దర్శించుకున్నారు. బోస్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అలాగే ఆయన వాడిన వస్తువులను ఆసక్తిగా తిలకించారు. వీటికి సంబంధించిన చిత్రాలను ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. 

ఇవీ చదవండి:

దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం: మోదీ

తేజస్‌పై ప్రపంచ దేశాల ఆసక్తి



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని