అమ్మంటే అంతే! బొద్దుగా ఉంటే నచ్చుతాం: కోహ్లీ
close

తాజా వార్తలు

Published : 23/07/2020 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మంటే అంతే! బొద్దుగా ఉంటే నచ్చుతాం: కోహ్లీ

ఫిట్‌నెస్‌ కోసం బరువు తగ్గితే బీమార్‌ వచ్చిందని బెంగపడేది

అమ్మంటే అంతే మరి! తన పిల్లలు ముద్దుగా బొద్దుగా ఉండాలని కోరుకుంటుందే తప్ప ఏ మాత్రం బరువు తగ్గినా అంగీకరించదు. అదేమీ కాదమ్మా.. ఇంకా దృఢంగా అవుతున్నానన్నా వినిపించుకోదు. బీమార్‌ వచ్చినోడిలా అయిపోతున్నావని బెంగపడుతుంది.

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీదీ ఇదే కథ! ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు మొదలు పెట్టి బరువు తగ్గినప్పుడు తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పాడు. ఎంత చెప్పినా తన తల్లి వినలేదన్నాడు. రుచికరమైన ఆహార పదార్థాలు వండిపెట్టేదని గుర్తుచేసుకున్నాడు. ‘ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌’ కార్యక్రమంలో కోహ్లీ ఆసక్తికర సంగతులు చెప్పాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

‘నేను బలహీన పడుతున్నానని మా అమ్మ ఎప్పుడూ అంటుండేది. అమ్మలంతా అలాగే అంటుంటారు కదా’ అని విరాట్‌ చెప్పాడు. ‘నువ్వు సన్నగా అవుతున్నావు. ఏమీ తినడం లేదు’ అని తన తల్లి విచారపడేదని గుర్తుచేసుకున్నాడు. ‘మనం ఆడాలనుకుంటున్న ఆటకు సంబంధించిన ప్రొఫెషనలిజం గురించి వారు ఆలోచించరు. బిడ్డ ముద్దుగా బొద్దుగా కనిపించకపోతే ఏదో జరుగుతోందని బెంగపడతారు’ అని అన్నాడు.

‘నాకేం కాలేదు. జబ్బు పడలేదు. క్రికెట్‌ ఆడాలనుకుంటున్నాను కాబట్టి ఇదంతా చేస్తున్నాను అని ఎప్పుడూ చెప్తుండేవాడిని. ఆమెను ఒప్పించడం చాలా కష్టమయ్యేది! కొన్ని సార్లు సరదాగా అనిపించేది. ఒక్కోసారి నేను నిద్రలేవగానే నువ్వు జబ్బుపడుతున్నావని అంటుండేది. ఇక కొన్నిసార్లు టేబుల్‌పైన రుచికరమైన ఆహార పదార్థాలు ఉంటే చూసి తట్టుకోవడం కష్టంగా ఉండేది’ అని విరాట్‌ పేర్కొన్నాడు.

-ఇంటర్‌నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని