Viral Video: నడిరోడ్డుపై కోతుల గ్యాంగ్‌వార్‌!

తాజా వార్తలు

Published : 28/07/2021 23:05 IST

Viral Video: నడిరోడ్డుపై కోతుల గ్యాంగ్‌వార్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోడ్లపై రౌడీ గ్యాంగ్‌లు ఘర్షణ పడటం చూసి ఉంటారు. కానీ, కోతుల గ్యాంగ్‌ కోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా! అయితే ఈ వీడియో చూడండి.. నడి రోడ్డుపై దాదాపు వంద కోతులు రెండు వర్గాలుగా విడిపోయి ఎలా ఘర్షణ పడుతున్నాయో! థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుందీ ఘటన. లోప్‌బరీ ప్రాంతంలోని బౌద్ధ దేవాలయం వద్ద భక్తులు ఇచ్చే పండ్లను తింటూ వందలాది కోతులు అక్కడే జీవిస్తున్నాయి. అయితే, కరోనా నేపథ్యంలో సందర్శకులు తగ్గిపోవడంతో కోతులకు ఆహార కొరత ఏర్పడింది. దీంతో ఆహారం కోసం నగరమంతా ఆన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు పక్కన లభించిన కొంత మొత్తం ఆహారం కోసం కోతులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగాయి. నడిరోడ్డుపైకి వచ్చి.. బీభత్సం సృష్టించాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ట్రాఫిక్‌ సిబ్బంది, స్థానికులు కోతులను చెదరగొట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కోతుల పరస్పర దాడిలో కొన్ని కోతులకు తీవ్ర గాయాలయ్యాయి. కోతుల ఘర్షణను ఓ వ్యక్తి ఫొటోలు, వీడియోలు తీసి ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని