రాష్ట్రాలకు ఉచితంగా 21కోట్ల డోసులిచ్చాం
close

తాజా వార్తలు

Updated : 20/05/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రాలకు ఉచితంగా 21కోట్ల డోసులిచ్చాం

దిల్లీ: కొవిడ్ మహమ్మారి కట్టడి నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర వ్యూహంలో టెస్టులు, ట్రాకింగ్‌, చికిత్సతో పాటు వ్యాక్సినేషన్‌ కూడా కీలక భాగమేనని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అందుకే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా టీకాలు అందిస్తూ వ్యాక్సినేషన్‌ను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 21కోట్ల టీకా డోసులను ఉచితంగా ఇవ్వగా.. అందులో ఇంకా 2కోట్ల డోసులు వాటి వద్ద మిగిలే ఉన్నాయని వెల్లడించింది. 

‘‘రాష్ట్రాలు, కేంద్రపాలిత పాంతాలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 21,07,31,130 డోసులను ఉచితంగా అందించింది. ఇందులో గురువారం ఉదయం నాటికి 19,09,60,575 డోసులను(వృథాతో కలిపి) రాష్ట్రాలు వినియోగించుకున్నాయి. ఇంకా దాదాపు 2 కోట్ల(1,97,70,555) డోసులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు రాబోయే మూడు రోజుల్లో మరో 26లక్షల డోసులను రాష్ట్రాలకు పంపించనున్నాం’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  

టీకా విధానంలో కేంద్రం ఇటీవల పలు మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మే 1 నుంచి ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిలో 50శాతం నేరుగా రాష్ట్రాలు, ప్రయివేటు సంస్థలకు విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది. మిగతా 50శాతం డోసులను కేంద్రం కొనుగోలు చేసి.. ఎప్పటిలాగే రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని