Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Published : 09/05/2021 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM

1. Corona పడగ నీడన పల్లెలు

పల్లెలు కరోనా గుప్పిట్లోకి వెళ్తున్నాయి. వైరస్‌పై అవగాహన లేకపోవడం, కరోనా లక్షణాలున్నా సరైన వైద్యం తీసుకోకపోవడంతో గ్రామీణులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కొన్ని ఊళ్లలో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రతో సరిహద్దున ఉన్న గ్రామాలు, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం నగరాలకు చుట్టూఉన్న పల్లెల్లో వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. Happy Hypoxia: యువతపై పంజా

కరోనా రెండో దశ యువతను ఎక్కువగా బలి తీసుకుంటోంది. స్వల్ప లక్షణాలే ఉండి అప్పటివరకు చూడటానికి ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నవారూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది మరణానికి కారణం ‘హ్యాపీ హైపోక్సియా’! వైద్య పరిభాషలో ‘సైలెంట్‌ హైపోక్సియా’గా కూడా పిలిచే ఈ లక్షణం నిజంగానే ఓ సైలెంట్‌ కిల్లర్‌. ఆరోగ్యవంతులైన మనుషుల రక్తంలో ఆక్సిజన్‌ 95 శాతానికిపైగా ఉండాలి. అది తగ్గే కొద్దీ మెదడుకు అందే ఆక్సిజన్‌ శాతం తగ్గి క్రమంగా వివిధ అవయవాలపై ప్రభావం కనిపిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. చిన్న పరిశ్రమలకు చేయూత

కరోనా సమయంలో తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రాష్ట్ర ఆర్థిక సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఆదేశాల మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల మేరకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రూ.76.13 కోట్ల రుణాలను మంజూరు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. Lokeshపై నాన్‌ బెయిలబుల్‌ కేసు

తెదేపా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌పై అనంతపురం జిల్లా డీ.హీరేహాల్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని నిందిస్తూ, అగౌరవపరుస్తూ, బెదిరిస్తూ ట్విటర్‌లో అనేక మార్లు పోస్టులు చేశారనే ఫిర్యాదుపై ఏప్రిల్‌ 30న ఈ కేసు నమోదు చేయగా.. శనివారం ఆ విషయం వెలుగుచూసింది. ఐపీసీ 153 (ఏ), 505, 506 సెక్షన్ల కింద బెయిల్‌కు వీల్లేని కేసును ఆయనపై పోలీసులు పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కొవిడ్‌ బాధితులకు స్టార్‌ హోటళ్లలో వైద్యం

కొవిడ్‌ బారిన పడిన వారిని స్టార్‌ హోటళ్లలో ఉంచి చికిత్స అందించేందుకు ప్రధాన ఆసుపత్రులు శ్రీకారం చుట్టాయి. జనం నుంచి పడకల కోసం ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో హోటళ్లలో గదులు తీసుకొని వైరస్‌ లక్షణాలు ఎక్కువగా లేని రోగులను అక్కడ ఉంచి వైద్యం అందిస్తున్నాయి. అవసరమైతే వెంటనే ఆసుపత్రికి తరలించడానికి వీలుగా సమీపంలో ఉండే వాటిని ఎంచుకొంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. సాధువులు, ఖైదీలు,యాచకులందరికీ వ్యాక్సిన్‌

కొవిడ్‌ టీకా అందుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏడు గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి చూపాలని నిబంధన విధించిన వైద్యఆరోగ్యశాఖ తాజాగా ఆ నిబంధనను సడలించింది. సంచార జాతులు (సాధువులు, సంత్‌లాంటివారు), ఖైదీలు, మానసిక ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారు, వృద్ధాశ్రమాల్లో తల దాచుకొనే వయోవృద్ధులు, రోడ్ల పక్కనుండే యాచకులు, పునరావాస కేంద్రాల్లోని అనాథలతోపాటు ఈ కోవలోకి వచ్చే ఇంకెవరికైనా 18 ఏళ్లు నిండి ఉంటే ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా వ్యాక్సిన్‌ అందించాలని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. సూపర్‌ ఫుడ్స్‌ అంటే ఏమిటి?

సూపర్‌ ఫుడ్స్‌కు శాస్త్రీయంగా ప్రత్యేక నిర్వచనం అంటూ ఏమీలేదు. మన శరీరానికి కావాల్సిన పోషకాలను అధిక మొత్తంలో అందించే పదార్థాలను సూపర్‌ ఫుడ్స్‌ అంటారు. వివరంగా చెప్పాలంటే... ఒక ఆహార పదార్థంలో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటే ఆ పదార్థాన్ని సూపర్‌ ఫుడ్‌ అంటారు.  సామాజిక మాధ్యమాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. నట్స్‌, అవిసె గింజలు, మునగాకు, బెర్రీస్‌, దానిమ్మ, నేరేడు, ఉసిరి, పసుపు, చిరుధాన్యాలు, వెల్లుల్లి, అవకాడో, క్వినోవా.... ఇవన్నీ సూపర్‌ఫుడ్సే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. అస్సాం సీఎం రేసులో హిమంత ముందంజ?

అస్సాం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది స్పష్టం కాబోతోంది. ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మకు సీఎంగా అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. శాసనసభకు కొత్తగా ఎన్నికైన భాజపా సభ్యులు ఆదివారం గువాహటిలో సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. దీంతో ఆరు రోజుల సందిగ్ధతకు తెరపడనుంది. ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌, ఆయనకు పోటీదారుగా ఉన్న మంత్రి హిమంత బిశ్వశర్మలు శనివారం దిల్లీ చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మా ఊరికి... కరోనాని రానివ్వం!

కరోనా వైరస్‌ ప్రపంచమంతా పాకిపోయి, అన్ని దేశాల్నీ వణికిస్తోంది. ఏడాదిగా ఈ మహమ్మారి ప్రభావం మనదేశంలోనూ భయంకరంగానే ఉన్నా... కొన్ని ఊళ్లు మాత్రం దాన్ని తమ పొలిమేరల్లోనూ అడుగుపెట్టకుండా చేశాయి. సమర్థంగా కొవిడ్‌-19ను ఎదుర్కొని ఇప్పటివరకూ ఏ ఒక్కరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆ ఊళ్ల సంగతులు తెలియాలంటే.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

10. పాఠశాల వద్ద పేలుడు..30 మంది బలి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఒక బాలికల పాఠశాల వద్ద ఉగ్రవాదులు శనివారం శక్తిమంతమైన బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థినులే. వీరంతా 11-15 ఏళ్ల వయసున్నవారే. మరో 50 మంది గాయపడ్డారు. పౌరులను లక్ష్యంగా చేసుకొని జరిపిన ఈ దాడిని తాలిబన్లు ఖండించారు. ఈ దుశ్చర్యతో తమకు సంబంధం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని