close

తాజా వార్తలు

Updated : 26/11/2020 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వన్‌ప్లస్‌ నార్డ్‌కి పోటీగా మోటో5G మొబైల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లోకి 5జీ మొబైల్స్‌ రాక మొదలైంది. వన్‌ప్లస్‌ ఇప్పటికే ‘నార్డ్‌’ సిరీస్‌తో రాగా, మోటోరోలా సిద్ధమైంది. ఈ నెల 30న మోటో జీ 5జీని తీసుకొస్తున్నారు. ధర, స్పెసిఫికేషన్ల విషయంలో వన్‌ప్లస్‌‌ నార్డ్‌ మొబైల్‌కు పోటీగా నిలుస్తుందని అంటున్నారు. మోటోరోలా నుంచి ఇప్పటికే 5జీ సాంకేతికతతో ‘రేజర్‌‌ 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే దాని ధర సామాన్య వినియోగదారుడికి అందనంత ఉంది. దాంతో పోలిస్తే మోటోజీ 5జీ తక్కువ ధరలో దొరకబోతోంది.  ఇప్పటికే యూరప్‌ మార్కెట్లో విడుదలైన ఈ మొబైల్‌ ఇప్పుడు మన దేశంలోకి వస్తోందన్నమాట. 

మోటో జీ 5జీ మొబైల్‌ ఫీచర్స్‌:

6.7 అంగుళాల, ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఇస్తున్నారు. మెమొరీ కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5,000ఎంఏహెచ్‌ కాగా, ఇది 20 వాట్‌ పాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. మొబైల్‌లో మూడు కెమెరాలు ఉంటాయి. 48 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్‌ ఉంటుంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. నార్డ్‌ ప్రారంభ ధర అయిన ₹25 వేలకు దగ్గరల్లోనే మోటో 5జీ ఫోన్‌ తీసుకొస్తారని అంటున్నారు. 

అన్నట్లు మరోవైపు వివో కూడా 5జీ ఫోన్‌ సిద్ధం చేస్తోందట. వివో వి20 పేరుతో త్వరలో 5జీ మొబైల్‌ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ మొబైల్‌ కూడా మోటో జీ 5జీ తరహాలోనే ఉంటాయట. ధర విషయంలో కాస్త ఎక్కువ చెల్లించాల్సి రావొచ్చు. సుమారు ₹30 వేల ధరలో ఈ మొబైల్‌ తీసుకొస్తారని భోగట్టా. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన