తల్లీకుమారుడు సజీవదహనం
close

తాజా వార్తలు

Published : 23/02/2021 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తల్లీకుమారుడు సజీవదహనం

=

పెద్దపప్పూరు: అనంతపురం జిల్లాలో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లీ కుమారుడిని మృత్యువు కరెంటు రూపంలో కాటేసింది. పెద్దపప్పూరు మండలం వరదాయపాలెంనకు చెందిన వెంకటలక్ష్మమ్మ(55), ఆమె కుమారుడు వెంకటస్వామి(36) తోటలో కూలి పనికోసం ద్విచక్రవాహనంపై బయల్దేరారు. పోలాల మధ్యలో ఉన్న బండ్లబాటపై అప్పటికే 33/11కేవీ  విద్యుత్‌ వైరు తెగిపడి ఉంది.   ప్రమాదవశాత్తూ ద్విచక్రవాహనం విద్యుత్‌ తీగలకు తగలడంతో మంటలు చెలరేగి ఇద్దరూ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని