
తాజా వార్తలు
నిజామాబాద్ జిల్లాలో తల్లీ కుమారుడి హత్య
చందూరు: నిజామాబాద్ జిల్లా చందూరు మండలం ఘన్పూర్ అటవీ ప్రాంతంలో తల్లి, కుమారుడి మృతదేహాలను ఆదివారం పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం ఉమ్నాపూర్ గ్రామానికి చెందిన సుజాత(30), ఆమె ఏడాదిన్నర కుమారుడిని మూడు రోజుల క్రితం ఘన్‌పూర్‌కు చెందిన చెవిటి రాము వంటచెరకు కోసం ఘన్పూర్ గుట్టకు తీసుకెళ్లారు. అదే రోజు వాళ్లిద్దరినీ హతమార్చాడు. అనంతరం వారిని అడవిలోనే పాతిపెట్టాడు. ఆదివారం చెవిటి రాము వర్ని పోలీసుస్టేషన్‌కు వచ్చి హత్య చేసినట్లు అంగీకరించి లొంగిపోయాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. హత్యకు గల కారణాలేంటనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి.. యూపీ: పైకప్పు కూలి 18 మంది మృతి!
Tags :