close

తాజా వార్తలు

Published : 16/07/2020 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జులై ఆఖరులో ఓటీటీ హుషారు

కరోనా కారణంగా పెద్ద తెర మీద సినిమాలు లేవు...ఉన్నదంతా బుల్లితెర, స్మార్ట్‌ తెర. వెండితెరపై ఓ వెలుగు వెలిగిపోదాం అనుకుని మొదలైన సినిమాలు ‘ఆలసించిన ఆశాభంగం’ అనుకున్నాయో... ‘మంచి తరుణం మించిన దొరకదు’ అనుకున్నాయో కానీ వరుసగా వచ్చేస్తున్నాయి. ఈ నెల ఆఖరి 15 రోజుల్లో ఐదు బాలీవుడ్‌ సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. అవేంటో చూద్దాం.

భానుప్రియ ముచ్చట్లు...

కొంచెం స్పైసీ సినిమా చూడాలి అనుకునేవాళ్లకు ఈ రోజే ‘జీ 5’ వేదికపై ‘వర్జిన్‌ భానుప్రియ’ విడుదలైంది. ఊర్వశీ రౌటేలా, గౌతమ్‌ గులాటీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది.  అర్చన సింగ్‌, డెల్నాజ్‌ ఇరానీ, బ్రిజేంద్ర కాలా ఇతర పాత్రల్లో నటించారు. భానుప్రియ అనే ఒక సిగ్గరి చుట్టూ తిరిగే కథ ఇది. అజయ్‌ లోహన్‌ దర్శకత్వం వహించారు. 


సుశాంత్‌ సింగ్‌ ఆఖరి సినిమా?

ఇటీవల మరణించిన యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ నటించిన ఆఖరి చిత్రం ‘దిల్‌ బెచెరా’. సంజన సంఘి కథానాయికగా నటించిన ఈ సినిమాకు ముకేశ్‌ ఛబ్రా దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 24న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జాన్‌ గ్రీన్‌ నవల ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. క్యాన్సర్‌ ఉన్న ఉన్న ప్రేమికులు తమ జీవితాన్ని ఎలా ఆనందంగా సాగించారు అనేది సినిమా కథ. ఈ సినిమా ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన ఏడు గంటల్లోనే ఎక్కువ మంది ఇష్టపడిన ట్రైలర్‌గా ఘనత సాధించింది.


నలుగురు స్నేహితుల ‘యారా’

ఓటీటీ అంటే.. క్రైమ్‌ డ్రామాకు పెట్టింది పేరు. ఈ కోవలో రూపొందిన చిత్రం ‘యారా’. విద్యుత్తు జమ్వాల్‌, అమిత్‌ సాధ్‌, విజయ్‌ వర్మ, కెన్నీ బసుమర్తి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. శ్రుతి హాసన్‌ మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. ‘ఏ గ్యాంగ్‌ స్టోరీ’ అనే ఫ్రెంచ్‌ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. నలుగురు కరుడుగట్టిన క్రిమినల్స్‌ వివిధ కారణాల వల్ల విడిపోయి... తిరిగి చాలా ఏళ్ల తర్వాత కలుసుకుంటే ఏం జరిగిందనేది కథ. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసీపూర్‌’ దర్శకుడు తిగ్మంశు దులియా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 30న ‘జీ5’లో రిలీజ్‌ అవుతోంది.


 సూట్‌కేసు దొరికాక ఏమైంది?

ఒక వ్యక్తికి సూట్‌ కేస్‌ దొరికింది.. తెరచి చూస్తే పెట్టినిండా డబ్బు. ఇంకేముంది పండగే అనుకున్నాడు. కానీ ఆ పండగ వెనుక ఛేజింగ్‌లు, రన్నింగ్‌లు, జంపింగ్‌లు ఉంటాయని అనుకోలేదు. డబ్బు కోసం చూస్తే... కష్టాలు పాలైన ఆ వ్యక్తి కథ ‘లూట్‌కేస్‌’. కునాల్‌ ఖేము, రసిక దుగ్గల్‌, విజయ్‌ రాజ్‌, గజ్‌రాజ్‌ రావు, రణ్‌వీర్‌ షోరే, నీలేశ్‌ దివేకర్‌ ప్రధాన పాత్రధారులు. రాజేశ్‌కృష్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ నెల 31న విడుదలవుతోంది. 


మానవ కంప్యూటర్‌ జీవితం

శకుంతల దేవి అనగానే ‘హ్యూమన్‌ కంప్యూటర్‌’ అని ఠక్కున చెప్పేస్తుంది పాత తరం. అంతగా ఆమె పేరు మార్మోగిపోయింది. కంప్యూటర్లకు సరిసమానంగా, ఒక్కోసారి వాటి కంటే వేగంగా గణితంలోని చిక్కు ప్రశ్నలను సైతం పరిష్కరించేవారు. గణితంలో ఎలా అయితే చిక్కుముళ్లు ఉన్నాయో శకుంతల జీవితంలోనూ ఉన్నాయి. అవేంటో మీకు చెప్పడానికే ‘శకుంతల దేవి’గా  విద్యాబాలన్‌ వస్తున్నారు. ఈ నెల 31న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అను మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ హిందీ సినిమాలో సన్యా మల్హోత్రా, అమిత్‌ సాధ్‌, జిస్సూ సేన్‌ గుప్తా తదితరులు నటించారు. Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని