‘తెరాస పాలనలో రైతులు బ‌త‌క‌లేక‌పోతున్నారు’
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘తెరాస పాలనలో రైతులు బ‌త‌క‌లేక‌పోతున్నారు’

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌: అన్నదాతల ఆత్మహ‌త్యలు రాష్ట్రానికి మంచివి కాదని.. వెంట‌నే రైతుల‌ను ర‌క్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెరాస అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల‌కు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి ఉన్న రైతుల‌కు అర‌కొర డ‌బ్బులు ఇస్తున్న స‌ర్కార్.. కౌలు రైతుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని ఆరోపించారు.  ఈ మేరకు రైతు సమస్యలపై సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి లేఖ రాశారు.

రాష్ట్రంలో తెరాస పాలనలో రైతులు బ‌త‌క‌లేక‌పోతున్నారని, వారికి న్యాయం జ‌ర‌గ‌డంలేదన్నారు. చిన్న, స‌న్నకారు రైతులు పండించిన పంట‌కు మ‌ద్దతు ధ‌ర లేక క‌న్నీరు పెడుతున్నారని.. కౌలు రైతులు అప్పులు తీర్చలేక ఉరికొయ్యల‌కు వేలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుప‌డ‌దని చెప్పిన సీఎం కేసీఆర్‌.. తక్షణమే రైత‌న్నల ఆత్మహ‌త్యలను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో కౌలు రైతుల‌ను గుర్తించి వారికి రైతుబంధు ప‌థ‌కం అమ‌లయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మృతి చెందిన రైతు కుటుంబాల‌కు రూ. 10ల‌క్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని