అప్పుడు విజయమ్మ ఎందుకు మాట్లాడలేదు?
close

తాజా వార్తలు

Updated : 16/04/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు విజయమ్మ ఎందుకు మాట్లాడలేదు?

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: వైఎస్‌ షర్మిలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న వైఎస్‌ విజయమ్మకు అమరావతి రాజధాని కోసం పోరాడుతోన్న మహిళా రైతులపై పోలీసుల దాడులు గుర్తుకురాలేదా? అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఏపీలో మహిళలపై దాడులు జరిగితే విజయమ్మ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. అమరావతిలో మహిళలను ఇళ్లల్లో నుంచి బయటకు రానివ్వడం లేదన్నారు. షర్మిలకు ఒక రూల్‌.. ఏపీ మహిళలకు మరొక రూలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. అమరావతిలో జరుగుతున్న దౌర్జన్యాలపై పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ మాట్లాడాలని.. తద్వారా పార్టీ గౌరవం మరింత పెరుగుతుందని రఘు రామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని