అప్పటి వరకు రాష్ట్రంలో అడుగుపెట్టను: రఘురామ
close

తాజా వార్తలు

Published : 08/04/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పటి వరకు రాష్ట్రంలో అడుగుపెట్టను: రఘురామ

దిల్లీ: పాలకుడు రాముడో, రావణుడో తేలాలని.. ఏపీ సీఎం జగన్‌పై కేసుల విచారణ పూర్తయ్యేవరకు రాష్ట్రంలో అడుగుబెట్టబోనని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు శపథం చేశారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ పిటిషన్‌ వేసిన తర్వాత తనకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. బెదిరింపులపై ప్రధానితో పాటు కేంద్రహోంమత్రికి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ తన అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. తనపై ఈగ వాలినా జగన్‌దే బాధ్యతని.. అతడికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. రమణ దీక్షితులు జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం దురదృష్టకరమని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని