close

తాజా వార్తలు

13 జిల్లాల ప్రజలు ఉద్యమించాలి: సుజనా

విజయవాడ: రైతుల ఆందోళన చూస్తుంటే చాలా బాధగా ఉందని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు, రైతులు దుర్గమ్మ గుడికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. రాజధాని గ్రామాల్లోని దేవాలయాల్లో పూజలు చేసుకోవం తప్పా అని ప్రశ్నించారు. రాజధాని గ్రామాల్లో ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు... వైకాపా ర్యాలీకి అనుమతులు ఎలా ఇస్తున్నారని నిలదీశారు. రైతులను మీ కులమేంటని పోలీసులు అడగడం దారుణమన్నారు. ‘‘ ఏది చేయాలన్నా చట్ట ప్రకారం చేయండి. ఆరు నెలల్లో ఇంత దారుణంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. రాష్ట్రంలో కల్లోలం సృష్టించి పైశాచిక ఆనందం పొందినట్లుగా ఉంది మీ వ్యవహారం. మీరు చేస్తున్న చర్యల వల్ల ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వచ్చింది.  ప్రజా స్వామ్య స్ఫూర్తితో 13 జిల్లాల ప్రజలు ఉద్యమించాలి. మేధావులు, ఎన్జీవోలు, పెన్షనర్లు కదం తొక్కాలి. రాష్ట్ర ప్రజలకు మద్దతుగా భాజపా పోరాడుతుంది. ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటాం’’ అని సుజనా చౌదరి అన్నారు.

కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది
‘‘మహిళల పట్ల పోలీసులు, ప్రభుత్వం తీరు దారుణంగా ఉంది.  రాజధాని ఉద్యమంలో మహిళల ఆవేదన బాధ కలిగిస్తోంది. 144 సెక్షన్‌కు సమయం, సందర్భం ఉండదా?. రాజధానిని కాపాడలేకపోతే మాకు ఈ పదవులు ఎందుకు? పదేళ్లు ఎంపీగా ఉండి ఉపయోగం ఏంటి? అమరావతిలో ఆందోళనలు, అరాచకాలు ఆపలేకపోతే ఈ పదవులు అనవసరం. డీజీపీ.. పార్టీ తొత్తుగా మారితే ఆయన సమస్యలు ఎదుర్కొంటారు. కేంద్రం ప్రతి నిమిషం ఇక్కడి పరిస్థితులు తెలుసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. పార్టీ కూడా రాజధానికి సహకరిస్తుంది. అవసరమైతే వ్యక్తిగతంగా పోరడతా. అమరావతిని అంగుళం కూడా మార్చలేరు’’ అని సుజనా చౌదరి స్పష్టం చేశారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.