సైకిల్‌పై పిజ్జా దోశ: వైరల్‌ వీడియో
close

తాజా వార్తలు

Published : 27/03/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సైకిల్‌పై పిజ్జా దోశ: వైరల్‌ వీడియో

ముంబయి: పిజ్జాలు మామూలుగానైతే స్టార్‌ హోటళ్లలోనే దొరుకుతాయి. కానీ, ముంబయికి చెందిన ఓ వ్యక్తి వీధుల్లో సైకిల్‌పై తిరుగుతూ పిజ్జాలు వేస్తున్నాడు. ఆయన వేస్తున్న ‘పిజ్జా దోశ’ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తి గత 25 సంవత్సరాలుగా ముంబయి వీధుల్లో సైకిల్‌పై తిరుగుతూ రకరకాల దోశలు వేస్తున్నారు. ఆయన పిజ్జా దోశ వేస్తున్న వీడియోను ‘ఆమ్‌చి ముంబయి’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వాహకుడు తన ఛానెల్‌లో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. 

రకరకాల దోశలు తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు, సామగ్రిని సైకిల్‌పైనే ఉంచి ఉదయం 4 గంటల నుంచే ఆయన తన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వీధుల వెంట తిరుగుతూ వినియోగదారులకు కావాల్సిన రుచికరమైన దోశలు ఆ సైకిల్‌పైనే వేసి ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన పిజ్జా దోశ వైరల్‌ అయింది. పిజ్జాకు కావాల్సిన అన్ని పదార్థాలను ఆయన ఉపయోగిస్తున్నారు. స్టార్‌ హోటళ్లలో దొరికే పిజ్జాకు ఏమాత్రం తీసిపోదని వినియోగదారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఆ వీడియోకు 12 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని